'కాంగ్రెస్ మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తుంది'
BDK: దమ్మపేటలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ వడ్డీలేని రుణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.