కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో గల కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి బి.కనకలక్ష్మి శనివారం సందర్శించారు. వంట గదిలో సరుకులను పరిశీలించడంతోపాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బాలికలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు.