కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ నివాళి

కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ నివాళి

JN: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ష లోమ్‌తో కలిసి కలెక్టరేట్‌లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాషా షేక్ మాట్లాడుతూ... కాళోజీ సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచారని, ఆయన జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.