కళాకారులకు వరం.. పీఎం విశ్వకర్మ మేళా
NLG: చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి 8 వరకు ఎస్బీఆర్ (SBR) ఫంక్షన్ హాల్లో 'పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్' నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ప్రదర్శనలో లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.