రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం: MEO

రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం: MEO

అన్నమయ్య: రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని చిట్వేలు MEO కోదండ నాయుడు తెలిపారు. ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని, 12:30 గంటలకు విద్యార్థులకు భోజనం వడ్డిస్తారని పేర్కొన్నారు. 10 పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.15 గంటల నుండి సా. 5 గంటల వరకు తరగతులు ఉంటాయని స్పష్టం చేశారు.