‘మా కాలనీలో డ్రగ్స్ లేవు’

KRNL: అసత్య ఆరోపణలతో వెంకటేశ్ అనే వ్యక్తి తమను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడని మద్దికెరకు చెందిన వార్డ్ మెంబర్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలో డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం ఉన్నట్లు అబద్దాలు చెబుతున్నాడని చెప్పారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు రాముడు,రంగనాథ్, వెంకటలక్ష్మి, నీలమ్మ, సాలమ్మ కోరారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.