హత్యకేసులో ఎమ్మెల్సీ భార్యకు బెయిల్
AP: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని.. పాస్‌పోర్ట్ అప్పగించాలని లక్ష్మీకి ఆదేశాలు జారీ చేసింది.