బీజేపీ జిల్లా ఇంఛార్జ్‌గా డాక్టర్ గోపి నియామకం
MHBD: సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జిల్లా ఇంఛార్జ్‌లను రాష్ట్ర కమిటీ నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జ్ గా నల్లగొండకు చెందిన డాక్టర్ జరుపులవత్ గోపి (కళ్యాణ్ నాయక్)ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు ప్రకటన విడుదల చేశారు.