ASU మండలాధ్యక్షుడిగా కేశోరావు

ADB: గాదిగూడ మండల కేంద్రంలో ఆదివారం ఆదివాసీ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి ఎన్నికలు నిర్వహించినట్లు ఆ సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ సూచించారు. సంఘం మండలాధ్యక్షులుగా కేశోరావు, మధు, ప్రధాన కార్యదర్శిగా వామన్, ఉపాధ్యక్షుడిగా రామేశ్వర్ లను ఎన్నుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంఘం బలోపేతానికి కృషి చేయాలనీ సంతోష్ అన్నారు.