ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్‌ఈ కి సన్మానం

WNP: బదిలీపై పెబ్బేరు ఇరిగేషన్ ఎస్‌ఈగా బాధ్యతలను స్వీకరించిన చంద్రశేఖర్‌ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తామని, కలిసికట్టుగా పనిచేస్తూ రైతులకు మేలు చేసే విధంగా ముందుకు నడుదామని ఆకాంక్షించారు.