రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
PPM: డోలీ మోతలు ఉండకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరీ అన్నారు. మంగళవారం కొమరాడ మండల టీడీపీ కన్వీనర్ శేఖర్ పాత్రుడు ఆధ్వర్యంలో మసిమండ, పెదశాఖ గ్రామ పంచాయతీలలో గిరిశిఖర గ్రామాల రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.