లంక గ్రామాల్లో కలెక్టర్ పర్యటన

బాపట్ల: కృష్ణానది వరద పరిస్థితులను అంచనా వేసేందుకు కలెక్టర్ వెంకట మురళి కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో గురువారం పర్యటించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులు, గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. పంట నష్టం అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ప్రమాద స్థాయి వరకు వరద ప్రవాహం లేదని, ప్రజలు భయపడవద్దని కోరారు. పుకార్లను నమ్మవద్దన్నారు.