రుడా ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్యే
E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని మొట్టమొదటిసారిగా ఆయన స్వాగ్రామంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట చౌదరి ఎమ్మెల్యే బలరామకృష్ణకు సాలువ కప్పి స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే అల్పాహారం స్వీకరించి కాసేపు ముచ్చటించుకున్నారు.