పుట్టపర్తిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు సత్కారం
సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని ఆర్టీసీ జిల్లా కార్యాలయంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. వ్యక్తిగత జీవితం, ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు, సిబ్బంది సేవలను అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. మహిళలు ధైర్యంతో ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని ఈ సందర్భంగా పేర్కొన్నారు.