కపిలేశ్వరపురంలో ఇఫ్తార్ విందు

కపిలేశ్వరపురంలో ఇఫ్తార్ విందు

కృష్ణా: రంజాన్ సందర్భంగా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో పామర్రు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సుమారు 300 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్షలతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ నెలలో సేవా కార్యక్రమాలు చేయడం శుభసూచకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎలమంచిలి గణేష్ తదితరులు పాల్గొన్నారు.