హిట్ టీవీ కథనానికి స్పందన

NLG: నల్గొండ మండలం కొత్తపల్లిలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై Hit Tvలో గత నెల 31న కథనం వచ్చింది. దీంతో అధికారులు స్పందించారు. గ్రామస్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన Hit Tv, అధికారులకు, సహకరించిన సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.