కృష్ణా నదిలో 750 TMCల నీరు వృథా

కృష్ణా నదిలో 750 TMCల నీరు వృథా

కృష్ణా: కృష్ణా నదికి ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన 750 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసి వృథా అయింది. దీని వల్ల కృష్ణా డెల్టాలోని సాగు భూములు, తాగునీటి ట్యాంకులకు ఐదేళ్లకు సరిపడా నీరు వృథా అయింది. డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు, 549 తాగునీటి ట్యాంకులకు ఏడాది పొడవునా 145 టీఎంసీల నీరు సరిపోతుంది.