రోడ్లు, భవనాలు, రవాణాశాఖపై సీఎం సమీక్ష
AP: రోడ్లు, భవనాలు, రవాణా శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులపై చర్చించారు. సమీక్షకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్, అధికారులు హాజరయ్యారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రోడ్ల నిర్మాణం జరగాలని సీఎం వారికి సూచించారు. తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఈ-బస్సులు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.