‘తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు’

TPT: తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నూతన సాఫ్ట్‌వేరు, ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు.