VIDEO: డ్రాలో తమ పేరు రాలేదని మహిళల వాగ్వాదం
NZB: ధర్పల్లిలో సుమారు 200 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. సోమవారం ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు డ్రా తీసి, 48 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేశారు. దీంతో ఇళ్లు రానివారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాము ఏళ్లుగా ఇళ్ల కోసమే ఎదురు చూస్తున్నప్పటికీ తమకు డ్రాలో ఇల్లు రాలేదని వాపోయారు. దీంతో పోలీసులు చొరువ తీసుకుని వారిని సముదాయించారు.