'ఎన్టీఆర్ గృహ నిర్మాణాల బకాయిలపై దృష్టి సారించాలి'
SKLM: ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల బిల్లుల బకాయిలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై మాట్లాడారు. 2014 -19 మధ్య నిర్మాణం జరిగిన ఇల్లు బిల్లులు రూ. కోట్ల రూపాయలలో చెల్లించకుండా ఉండటంపై అధికారులను ప్రశ్నించారు.