కార్మిక చట్టాల రద్దు దుర్మార్గం : AITUC
KDP: బద్వేల్ పట్టణంలో AITUC ఏరియా సమితి సమావేశం మంగళవారం జరిగింది. AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చడం దుర్మార్గమైన చర్య అని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.1920 అక్టోబర్ 31న లాలా లజపతిరాయ్ అధ్యక్షతన AITUC ఏర్పడిందన్నారు.