సీడీపీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశం
ATP: సీడీపీవోలు, సూపర్వైజర్లు నిత్యం పిల్లల బరువును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలోని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతినెల జరిగే సమావేశంలో కచ్చితంగా పిల్లలకు గ్రోత్‌కు సంబంధించిన డేటా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.