VIDEO: పారాపురంలో పారిశుద్ధ్య పనులు
SKLM: కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో బుధవారం పారిశుద్ధ్య పనులను చేపట్టారు. స్థానిక సర్పంచ్ రత్నాలమ్మ ఆధ్వర్యంలో ఈ పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త వాహనానికి అందజేయాలని సూచించారు. తడి, పొడి చెత్తలను వేరువేరుగా అందజేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.