అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి: ఏసీపీ
KMM: వేంసూరు మండలం మర్లపాడు, వెంకటాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను శుక్రవారం ఏసీపీ వసుంధర యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. నామినేషన్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.