యువ సైనికుడిని సన్మానించిన ఎమ్మెల్యే

యువ సైనికుడిని సన్మానించిన ఎమ్మెల్యే

ASF: జైనూర్ మండలం జంగావ్ గ్రామానికి చెందిన యువకుడు మరప జ్యోతిరామ్ అగ్నివీర్ పథకంలో ఇటీవల ఎంపికయ్యాడు. చండీఘడ్‌లో నూతన పోస్టింగ్ వచ్చిన సందర్భంగా సోమవారం MLA ఎమ్మెల్యే కోవ లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. ​యువ సైనికుడిని ప్రత్యేకంగా అభినందించి, MLA శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో దేశ రక్షణలో గొప్పగా రాణించాలని పేర్కొన్నారు.