మోస్రా మండలంలో రెండో రోజు కొనసాగిన నామినేషన్ల పర్వం
NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు శుక్రవారం అష్టమి కావడంతో చాలా మంది వాయిదా వేసుకున్నారు. మోస్రా మండలం గోవూర్లో సర్పంచ్ స్థానానికి ఓ అభ్యర్థి నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మండలం మొత్తం వార్డు స్థానాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. శనివారం చివరి రోజు కావడంతో నామినేషన్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.