ట్రాక్టర్ నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ఎర్రబెల్లి

వరంగల్ జిల్లా వేదికగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళుతున్నారు. ఆదివారం వర్ధన్నపేట మండలం కట్య్రాల వద్ద ట్రాక్టర్ ర్యాలీని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. కాసేపు ర్యాలీలో పాల్గొని ట్రాక్టర్ నడిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.