విద్యుత్ సరఫరాకు అంతరాయం
WG: తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్, కొండయ్య చెరువు, జువ్వలపాలెం సబ్ స్టేషన్ పరిధిలో లైన్ మరమ్మతుల నిమిత్తం ఆదివారం ఉ.8 నుంచి మ.2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఈఈ నరసింహమూర్తి తెలిపారు. శనివారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.