కలెక్టరేట్‌కు వెళ్లాలంటే చుక్కలే..!
SRPT: జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లడం సామాన్యులకు భారంగా మారింది. కార్యాలయం పట్టణానికి 3 కి.మీ.దూరంలో ఉండటం వలన బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని జిల్లావాసులు కోరుతున్నారు.