'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

SRD: భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టపరిహారం వివరాలు సేకరించాలని కోరారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నష్టపోయినట్లు పేర్కొన్నారు.