అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

PLD: క్రోసూరుకి చెందిన సింగంపల్లి పున్నారెడ్డి అచ్చంపేట మండలం వేల్పూరు సమీపంలోని పంట పొలాలలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. వేసిన పంటలకు దిగుబడి లేక పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు తెలిపారు.