రేపు వింజమూరులో మంత్రి పర్యటన

NLR: వింజమూరు టౌన్ లోని యాదవ బజారు నందు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు గృహ నిర్మాణం & పబ్లిక్ రిలేషన్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.