ఎస్‌బీఐ చైర్మన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: మల్లు లక్ష్మి

జాజిరెడ్డిగూడెం: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ను వెంటనే అరెస్టు చేసి ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఎస్‌బీఐ మోడీ సర్కార్‌కు తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు.