వైసీపీ కార్యకర్తకు ఘన నివాళి

ATP: కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకట రమణ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం నియోజకవర్గం వైసీపీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు వారి నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.