నేడు వైసీపీ కౌన్సిల్ చివరి సర్వసభ్య సమావేశం
ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వ కౌన్సిల్ రేపటితో ఐదేళ్లు కాలం ముగియనుంది. దీంతో నేడు చివరి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛైర్‌పర్సన్ శిల్ప పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి మున్సిపల్ కౌన్సిలర్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్షన్ సభ్యులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొనాలని ఆమె సూచించింది.