ఎమ్మెల్యేను సన్మానించిన బాసర విద్యార్థులు
NRML: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు శనివారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్‌ను విద్యార్థులు శాలువాతో సన్మానించారు. భైంసాలోని ఆయన నివాసంలో కలిసిన విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి ఆయన ఎల్లప్పుడూ అండగా ఉండాలని వారు కోరారు.