హాకా సెంటర్‌ను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి
NRPT: జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సోమవారం ఊట్కూర్ మండల కేంద్రంలోని హాకా సెంటర్‌ను తనిఖీ చేశారు. రైతులకు యూరియా కొరత రాకుండా చూసుకోవాలని, ప్రస్తుత అవసరాలకు మేర కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా యాప్ ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశించారు. పాస్ మెషిన్, యాప్, రిజిస్టర్, ఫిజికల్ స్టాక్ బ్యాలెన్స్ సమానంగా ఉండేలా ఫర్టిలైజర్ డీలర్లకు సూచనలు ఇచ్చారు.