ప్రజల వద్దకు ఎమ్మెల్యే ప్రవీణ్
PLD: క్రోసూరు మండలం ఉయ్యందనలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ '100 రోజులు-100 గ్రామాలు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. దీర్ఘకాలిక, రెవెన్యూ సమస్యలను త్వరగా తీర్చాలని ఆదేశించారు. కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.