ఉపాధి హామీ పనులు పరిశీలన

VZM: పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పాచిపెంట ఎంపీడీఓ బివిజె పాత్రో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్‌లో నమోదు చేసిన పేర్లు, పని ప్రదేశంలో ఉన్నారో లేదా, అని క్రాష్ చెక్ చేశారు. పనికి వచ్చిన వారికి మాత్రమే మాస్టర్‌లో నమోదు చెయ్యాలని, తప్పుగా నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.