జిల్లాకు 1470 మెట్రిక్ టన్నుల యూరియా రాక
ATP: ఇఫ్కో కంపెనీకి చెందిన 1,470 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చినట్లు వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చిన యూరియాలో 470 మెట్రిక్ టన్నులు మార్ఫెడు, 1000 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు.