ములుగు జిల్లాలోనే పెద్దపులి సంచారం!

MLG: జిల్లా తాడ్వాయి అడవుల్లోకి బుధవారం పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడ్వాయి మండలం పంబాపూర్ సమీప అడవుల్లో పెద్దపులి పాదముద్రల గుర్తించామని రేంజర్ కోట సత్తయ్య తెలిపారు. ఓ వాగు వద్ద సంచరించినట్లు తెలిపారు. ఆ తర్వాత పాదముద్రలు కనపడలేదన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.