జిల్లాలో పుంజుకున్న బీజేపీ
KNR: 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మరింత పుంజుకుంది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 98 స్థానాల్లో బీజేపీ బలపరచిన అభ్యర్థులు పోటీ చేయగా సుమారుగా 28 గ్రామ పంచాయతీల వరకు బీజేపీ కైవసం చేసుకోవడంతో జిల్లాలో బీజేపీ పుంజుకున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కటి రెండు గ్రామాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని జిల్లాలో పుంజుకుంది.