'అది AI వీడియో': MLA నసీర్

BPT: ఓ మహిళతో గుంటూరు ఈస్ట్ MLA నసీర్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఓ వీడియో వైరలవుతోంది. దీనిపై ఆయన స్పందించారు. '20ఏళ్లుగా TDP గెలవని చోట నేను MLA అయ్యాను. దీన్ని తట్టుకోలేక నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. AIతో రూపొందించిన ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్నారు. మీకు ధైర్యముంటే ఈ వీడియో నిజమని నిరూపించండి అని ఆయన అన్నారు.