సంగం జడ్పీ హైస్కూల్లో షూటింగ్ బాల్ ఎంపికలు

NLR: సంగం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఎంపికలు, షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి BV రమణయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు బుచ్చిరెడ్డిపాలెం హైస్కూల్‌లో శిక్షణ తీసుకుంటారని రమణయ్య తెలియజేశారు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.