గోకఫసల్వాద్‌లో ఘనంగా ముగ్గులు పోటీలు

గోకఫసల్వాద్‌లో ఘనంగా ముగ్గులు పోటీలు

VKB: దౌలతాబాద్ మండలం గోకాఫసల్వాడ్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఆడపడుచులకు ముగ్గుల పోటీలు, యువకులకు క్యారమ్స్, చెస్ పోటీలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మహిళలు రంగురంగుల ముగ్గులతో ఆలయ పరిసరాలను ముస్తాబు చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.