ఆ రైల్వేలైన్ ప్రారంభమయ్యేదెప్పుడు?: ఎంపీ శబరి

ఆ రైల్వేలైన్ ప్రారంభమయ్యేదెప్పుడు?: ఎంపీ శబరి

AP: కర్నూలు జిల్లాలోని డోన్-దూపాడు-బేతంచర్ల మధ్య రైల్వేలైన్ ప్రారంభమయ్యేదెప్పుడు? అని ఎంపీ శబరి కేంద్రాన్ని ప్రశ్నించారు. '2013లోనే సర్వే పూర్తి చేసినా ఇంకా పట్టాలెక్కలేదు. ఇది పూర్తయితే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌లను కనెక్ట్ చేస్తుంది. నంద్యాల-కర్నూలు మధ్య 60KM దూరాన్ని తగ్గిస్తుంది. త్వరగా DPR పూర్తిచేసి నిధులు ఇవ్వాలని కోరుతున్నా' అని విజ్ఞప్తి చేశారు.