VIDEO: స్వామివారికి చీర, సారె సమర్పణ

E.G: అమలాపురం మండలం బండారులంకలో వేంచేసి ఉన్న పద్మావతి అలివేలుమంగ సమేత వెంకటేశ్వరస్వామి 37వ వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా ముత్తయిదువులు స్వామి, అమ్మవార్లకు చీర, సారె భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తొలుత మహిళలంతా మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య పసుపు కుంకుమలు, చీర, జాకెట్లు, గాజులు, చలివిడి, అరటిపండ్లను ఊరేగింపుగా సోమవారం తీసుకువెళ్ళారు..