అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతిపత్రాలు సమర్పించగా, ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.