జిల్లాలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు

జిల్లాలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు

ASR: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న అండర్ 14, 17, 19 విలువిద్య (ఆర్చరీ) క్రీడా పోటీలకు ఈసారి జిల్లా ఆతిథ్యం ఇవ్వనుందని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నవంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ పోటీలు పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల మైదానాల్లో జరగనున్నాయన్నారు. పోటీల గోడ పత్రికను ఇవాళ ఆవిష్కరించారు.